సెప్టెంబర్ లో వయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక ?
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దొంగలందరి ఇంటి పేరూ మోదీయే ఎందుకుంటుందో అని వ్యాఖ్యానించిన కేసులో సూరత్‌కోర్టు రాహుల్‌ను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించడం తెలిసిందే. కోర్టు తీర్పు నేపథ్యంలో ఎంపీగా రాహుల్‌పై అనర్హత వేటు పడిరది. ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దు చేస్తూ పార్లమెంట్ సెక్రటేరియట్ నిర్ణయం తీసుకుంది. కాగా రాహుల్‌పై అనర్హత వేటు వేయడంతో లోక్‌సభలో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ స్థానం ఖాళీ అయినట్టు లోక్‌సభ పేర్కొంది. ప్రజాప్రాతినిధ్య చట్టం 2015లోని సెక్షన్ 151(ఎ) ప్రకారం ఏ కారణం చేతనైనా ఎమ్మెల్యే, ఎంపీ స్థానం ఖాళీ అయిన 6 నెలల్లోపు ఉప ఎన్నిల నిర్వహించి ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది. రాహుల్‌పై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన వయనాడ్ స్థానానికి నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 23లోపు ఉప ఎన్నిక జరగాలి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లో ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు సమాచారం. .













