తలైవాతో… చిన్నమ్మ భేటీ
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో దివంగత జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ భేటీ అయ్యారు. ప్రస్తుత పరిణామాలు చిన్నమ్మకు ప్రతికూలంగా ఉన్నా పార్టీని చేజిక్కించుకునేందు ప్రయత్నాలు మాత్రం చేస్తోంది. పోయెస్ గార్డెన్‌లోని రజనీ నివాసానికి వెళ్లిన శశికళ 40 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. అయితే రజనీతో భేటీకి గల కారణాన్ని శశికళ వివరించారు. రజనీ ఇటీవల అనారోగ్యంతో బాధపడ్డారు. పరామర్శ కోసం మాత్రమే ఇంటికి వెళ్లాను. ఎలాంటి రాజకీయ కోణం లేదు అంటూ ప్రకటన చేశారు. కానీ ఉద్దేశం అది కాదని అసలు వ్యూహం వేరే ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు.
రజనీతో భేటీకి సంబంధించిన ప్రకనటలో శశికళ తాను అన్నాడీఎంకే చీఫ్‌గా ప్రకటించుకోవడం చర్చించాల్సిన అంశమే. రజనీతో జరిగిన భేటీలో రాజకీయ ప్రస్తావన చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏడీఎంకేలో ఏం జరుగుతోంది అని రజనీ అడిగినట్టు సమాచారం. దీనికి అంతా మంచే జరగబోతోందని సందర్భం వచ్చినప్పుడు మద్దతు ఇవ్వాలని రజనీకాంత్‌ను శశికళ కోరడం లాంటి చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో రజనీకాంత్ సతీమణి లత కూడా ఉన్నారు.













