విరాట్ కోహ్లీ మరో నిర్ణయం…
భారత టీమ్ టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లి మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంటజర్స్ బెంగళూరు సారథ్య బాధ్యతల నుంచి సైతం విరాట్ కోహ్లీ తప్పుకోనున్నాడు. ఐపీఎల్ 2021 సీజనే ఆర్సీబీ కెప్టెన్గా కోహ్లీకి చివరి సీజన్ కానుంది. ఆపై ఆటగాడిగా జట్టులో కొనసాగనున్నాడు. ఈ మేరకు కోహ్లీ నిర్ణయాన్ని ఆర్సీబీ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడిరచింది. ఇటీవల అంతర్జాతీయ టీ20లకు టీమ్ ఇండియా కెప్టెన్సీ నుంచి 2021 టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోనున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ తో తన కెప్టెన్సీ ముగిస్తుందని వీడియో రూపంలో తెలిపాడు.













