నిన్న కూలీ.. నేడు మోడల్
ఏజ్ ఈజ్ ఓన్లీ ఓ నంంబర్ వయసు ఒక సంఖ్య మాత్రమే. ఈ సామెతను మరోమారు నిజం చేసి చూపిస్తున్నాడు. కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన రోజువారీ కూలీ మమ్మిక్క (60) ఎలాంటి ప్రయత్నం చేయకుండానే మోడల్ అయిపోయారు. మమ్మిక్కను చూసిన షరీక్ వయాలిల్ అనే ఫోటోగ్రాఫర్ ఓ ఫోటో తీసి తన ఫేస్బుక్ పేజీలో ఉంచారు. ఈ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. కొందరైతే నటుడు వినాయకన్లా ఉన్నాడంటూ కామెంట్లు పెట్టారు. దీంతో మోడలింగ్ చేస్తావాఅని మమ్మిక్కను షరీక్ అడిగారు. దీనికి ఆయన అంగీకరించారు. ఇంకేముందు చక్కటి సూటూబూటు కళ్లద్దాలు ధరించి చేతిలో ఐపాడ్తో ఉన్న మమ్మిక్కను షరీక్ తన కెమెరాలో బంధించారు. అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచగా వేలాది మంది నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. మమ్మిక్కను ఫోటో షూట్ కోసం సిద్ధం చేస్తున్నప్పుడు తీసిన వీడియోను 23,000 మందికి పైగా వీక్షించారు. ఇకపై కూలి పనులు చేసుకుంటూనే మోడలింగ్ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తానని మమ్మిక్క చెబుతున్నారు.













