విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి
విజయదశమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే దసరా పండుగ.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు అని ఆయన అన్నారు. అంతేకాకుండా మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి ఆదర్శవంతమైన జీవనాన్ని మనకు గుర్తు చేస్తుందని, వారు పాటించి చూపిన సన్మార్గంలో మనం కూడా పయనించేందుకు మార్గదర్శనం చేస్తుందన్నారు. మనలోని చెడు ఆలోచనలను వదులుకుంట, సానుకూల దృక్పథంతో ముందుకెళ్లేందుకు దసరా పండుగ అందరి జీవితాల్లో శాంతి, సమరసతా, సమృద్ధి తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను ఉపరాష్ట్రపతి అని తన సందేశంలో పేర్కొన్నారు.













