50 ఏళ్ల తర్వాత ఓ భారతీయ వైద్యుడికి ఈ గౌరవం : ఉప రాష్ట్రపతి
అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ ఫెలోషిప్ దక్కించుకున్న ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ప్రముఖ వైద్యుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు. 50 ఏళ్ల తర్వాత ఓ భారతీయ వైద్యుడికి ఈ గౌరవం దక్కడం అందరికీ గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు. అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్-2020 సంవత్సరానికి ప్రకటించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల జాబితాలో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి చోటు లభించిన విషయం విధితమే.
మెడికల్ సైన్సెస్ విభాగంలో ఆయనతో పాటు మరో 39 మంది ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చేసిన అనేక నూతన ఆవిష్కరణలకు గుర్తింపుగా ఫెలోషిప్‌కు ఆయన ఎంపికయ్యారు. గత నవంబర్ 24న జాబితాను ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.













