అమెరికాలోనూ రామమందిర ప్రారంభోత్సవాలు
అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజున అమెరికాలోనూ సంబరాలు మిన్నంటనున్నాయి. జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు అమెరికా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీఏ) తెలిపింది. ఇందుకోసం అమెరికాలో నివసిస్తున్న ప్రతి హిందూ కుటుంబం తమ ఇంటి వద్ద ఆ రోజు అయిదు దివ్వెలను వెలిగించాలని పిలుపునిచ్చింది. అయోధ్య వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు తెరలను ఏర్పాటు చేయనున్నారు. వివిధ నగరాల్లో కారు ర్యాలీలతో పాటు సమావేశాలనూ నిర్వహించనున్నారు. హిందూ అమెరికన్ల కోసం https://rammandir2024.org వెబ్సైట్ను ప్రారంభించినట్లు వీహెచ్పీఏ తెలిపింది. ఇందులో నమోదు చేసుకున్న వెయ్యికిపైగా ఆలయాలు, భక్తులకు అయోధ్య నుంచి వచ్చే ప్రసాదాలను అందజేయనున్నట్లు ప్రకటించింది.













