వారు వ్యాక్సిన్ తీసుకోవాలంటే.. రిజిస్ట్రేషన్ తప్పనిసరి
18 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన వారికి మే 1వ తేదీ నుంచి వ్యాక్సిన్ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వ్యాక్సిన్ తీసుకునేవారు తప్పనిసరిగా కొవిన్ వెబ్ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సిందేనని ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం 45 సంవత్సరాలు దాటిన వారు కూడా కొవిన్ వెబ్‌పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవాలి. అయితే ఆధార్‌కార్డుతో నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లినా వైద్య సిబ్బంది పేరు, వివరాలు నమోదు చేసుకుని వ్యాక్సిన్ ఇస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో మే 1 నుంచి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఒక్కసారిగా డిమాండ్ పెరుగుతుంది. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద జనాబా తాకిడి ఎక్కువవుతుంది. దీన్ని నియంత్రించడానికే కొవిన్ పోర్టల్‌లో వివరాలు నమోదు తప్పనిసరి చేశాం. నేరుగా ఆయా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవడాన్ని ప్రస్తుతానికి అంగీకరించం అని ఉన్నతాధికారులు తెలిపారు. 18 సంవత్సరాల వయసు దాటిన వారందరూ కొవిన్ పోర్టల్, ఆరోగ్య సేతు యాప్ ద్వారా ఏప్రిల్ 28వ తేదీ నుంచి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు అని తెలిపింది.













