కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. బడ్జెట్‌కు ముందు
బడ్జెట్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ కొత్త ముఖ్య ఆర్థిక సలహాదారు (సిఇఎ)గా అనంత నాగేశ్వరన్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన బాధ్యతలు స్వీకరించారని ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ సలహాదారుగా కెవి సుబ్రమణియన్ పదవీకాలం 2021 డిసెంబర్‌తో ముగిసింది. అప్పటి నుంచి ఈ స్థానంలో కొత్త సిఇఎని నియమించలేదు. 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ఈ నెల 31న ప్రభుత్వం విడుదల చేయనున్న నేపథ్యంలో కొత్త సిఇఎ నియమకం జరిగింది. దీని తర్వాత ఫిబ్రవరి 1న బడ్జెట్ 2022ను కూడా ప్రవేశపెట్టనున్నారు.













