తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన యూపీ స్పీకర్
తెలంగాణ రాష్ట్ర శాసనసభను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ సతీశ్ మహాన్ సందర్శించారు. రాష్ట్ర శాసనసభ పర్యటనకు విచ్చేసిన ఆయనకు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సతీష్ మహాన్‌కు తెలంగాణ రాష్ట్ర శాసనసభ నిర్వాహణ, పనితీరును వివరించారు. తెలంగాణ రాష్ట్ర శానసభ నిర్వాహణ అత్యుత్తమంగా ఉన్నదని, ప్రజా సమస్యలపై చర్చలు అర్ధవంతంగా జరుగుతున్నాయని యూపీ స్పీకర్‌కు సభాపతి పోచారం వివరించారు. శాసనసభ సమావేశాల నిర్వాహణ, పద్దతులపై చర్చించి ఇరువురు స్పీకర్లు. ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ స్పీకర్ సతీష్ మహాన్‌ను శాలువాతో సత్కరించి మెమోంటో బహుకరించారు.













