కాలిఫోర్నియా భక్తుడు షిర్డీ సాయిబాబాకు విరాళం
మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆస్థానానికి అమెరికా కాలిఫోర్నియా నుంచి వచ్చిన ఓ భక్తుడు యాబై వేల డాలర్లను విరాళంగా ఇచ్చారు. భారత కరెన్సీలో ఇది దాదాపు 41 లక్షల రూపాయలకు సమానం. ఆసుపత్రిలోని పేదల వైద్యం కోసం డాక్టర్ అఖిల్ శర్య, డాక్టర్ అపర్ణ శర్మ సాయి ఇనిస్టిట్యూట్ కు ఈ విరాళాన్ని అందించారు. తామిచ్చిన విరాళం పేదలకు వైద్యం అందించడానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నట్లు డాక్టర్ అఖిల్ శర్మ తెలిపారు. తమ కుటుంబంలో అంతా వైద్యులు అయినందుకున వైద్య నిధికి ఈ విరాళం ఇచ్చినట్టు డాక్టర్ అపర్ణ శర్మ తెలిపారు. తామంతా బాబా భక్తులమని వెల్లడిరచారు. ఈ విరాళాన్ని సాయి సంస్థాన్ కు చెక్కు ద్వారా అందించిన తరువాత ఈ ధార్మిక భక్తులను సాయి ట్రస్ట్ సత్కరించింది.













