యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల
అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్-2021 ఫలితాలు వెల్లడయ్యాయి. 685 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. జనరల్ కోటాలో 244 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 73, ఓబీసీ 203, ఎస్సీ 105, ఎస్టీ విభాగం నుంచి 60 మంది ఉన్నారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్‌కు 180, ఐపీఎస్‌కు 200, ఐఎఫ్ఎస్కు 37 మంది ఎంపికయ్యారు. ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ కేటగిరీకి 242 మంది ఎంపిక కాగా మరో 90 మంది గ్రూప్ బీ సర్వీసులకు ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. వీరిలో శృతి శర్మకు మొదటి ర్యాంకు, అంకిత అగర్వాల్‌కు రెండో ర్యాంకు, గామిని సింగ్లాకు మూడో ర్యాంకు వచ్చాయి.
సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. యశ్వంత్‌కుమార్‌రెడ్డికి 15వ ర్యాంకు రాగా, పూసపాటి సాహిత్య (24), మంత్రి మౌర్య భరద్వాజ్ (28), కొప్పిశెట్టి కిరణ్మయి (56), శ్రీపూజ (62), గడ్డం సుధీర్‌కుమార్‌రెడ్డి (69), ఆకునూరి నరేశ్ (117), అరుగుల స్నేహ (136), బి.చైతన్యరెడ్డి (161), ఎస్.కమలేశ్వరరావు (297), విద్యామరి శ్రీధర్ (336), దిబ్బద ఎస్వీ అశోక్ (350), గుగులావత్ శరత్ నాయక్ (374), నల్లమోతు బాలకృష్ణ (420), ఉప్పులూరి చైతన్య (470), మన్యాల అనిరుధ్ (564), బిడ్డి లఖిల్ (566), రంజిత్‌కుమార్ (574), పాండు విల్సన్ (602), బాణావత్ అరవింద్ (623), బచ్చ స్మరణ్‌రాజ్ (676) ర్యాంకులు సాధించారు.













