యూపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల
యూపీఎస్సీ 2020 సంవత్సరానికి నిర్వహించాల్సిన పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ మేరకు ఆక్టోబరు 4, 2020న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష, జనవరి 8, 2021 తేదీన మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ప్రిలిమినరీ పరీక్షను మే 31 నిర్వహించాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేశారు. అలాగే 2019 సంవత్సరానికి సంబంధించి నిర్వహించాల్సిన పర్సనాలిటీ టెస్టులు జులై 20, 2020 నుంచి ప్రారంభమవుతాయని, ఎంపికైన అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం అందించనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. ప్రతి ఏడాది సుమారు ఏడు లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలకు హాజరవుతుంటారు. అయితే ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు సమచారం.













