పెళ్లి కాని మహిళలకు మాత్రమే అవకాశం!
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), నౌకాదళ అకాడమీలో ప్రవేశం కోసం పరీక్ష రాసేందుకుగాను మహిళలకు ఈ ఏడాది నుంచే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే అవివాహిత మహిళలకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. నవంబరు 14న నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు తగిన అర్హతలు కలిగివారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ప్రత్యేకంగా ఈ నెల 24 నుంచి అక్టోబర్ 8 వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు తెలిపింది. మహిళ అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇందులో పురుషులు దరఖాస్తు చేస్తే, పదేళ్ల పాటు యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలన్నింటికీ వారిని అనర్హులుగా ప్రకటిస్తామని హెచ్చరించింది.













