ఫైజాబాద్ రైల్వేస్టేషన్ పేరు మార్చనున్న యుపి ప్రభుత్వం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆదిత్యనాథ్ తాను ఎంపీగా ఉన్న ఘోరక్‌పూర్‌లోని పలు ప్రాంతాల పేర్లను ముస్లింకు బదులుగా హిందు పేర్లను తీసుకొచ్చారు. ఇంకా చాలా ప్రాంతాల పేర్లు మార్చాల్సి ఉన్నదని, తాజ్‌మహల్‌ను రామ్‌మహల్‌గా కూడా మార్చాలన్న యోచన ఉన్నట్లు ఒక టీవీ ఛానల్ చర్చలో యోగి ఆదిత్యనాథ్ వెల్లడిరచారు. అదేవిధంగా రాజ్యంగంలోని ఆర్టిక్ 1 లో పేర్కొన్న ఇండియా అనే పదాన్ని హిందుస్థాన్‌గా మార్చేందుకు చట్టసవరణ తేవాలని కూడా యోగి కేంద్రానికి ప్రతిపాదనలు కూడా చేశారు. ఇప్పుడు ఫైజాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్‌పేరును అయోధ్య కంటోన్మెంట్‌గా మార్చనున్నారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలో క్యాబినెట్ మీటింగ్‌లో చర్చించి పేరు మార్చే ఉత్తర్వులు ఇవ్వనున్నారని స్థానిక అధికారుల ద్వారా తెలిసింది. డివిజనల్ రైల్వే మేనేజర్ సంజయ్ త్రిపాఠితో ఫైజాబాద్ ఎంపీ లల్లూ సింగ్ మాట్లాడుతూ, తాను రైల్వే మంత్రితో కూడా ఈ విషయంపై చర్చించానని, ఫైజాబాద్ స్టేషన్ పేరును అయోధ్య కంటోన్మెంట్‌గా మార్చడంపై మాట్లాడానన్నారు.













