యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ ?
ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మ్యుమంత్రిగా ఎవరు పోటీ చేస్తారనే దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని గత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ప్రియాంక పెద్దహిట్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమె పేరు దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకలు పార్టీ యూత్ మేనిఫోస్టోను విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు ప్రియాంక స్పందిస్తూ ఇంకెవరైనా కనిపిస్తున్నారా? మరి ఇంకేంటి? ఎక్కడ చూసినా నేనే కనిపిస్తున్నాగా చూడడం లేదా? అని అన్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక పేరును ప్రకటించే అవకాశాలు దాదాపు ఖాయంగానే కనిపిస్తున్నాయి. త్వరలోనే కాంగ్రెస్ దీనిపై అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.













