వారి జోలికొస్తే మీకు నూకలు చెల్లినట్లే : యోగి వార్నింగ్
మాఫియా శక్తులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అంబేడ్కర్ నగర్లో రూ.2,122 కోట్లతో చేపట్టిన పలు ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ పేద ప్రజల జీవితాల్లో జోక్యం చేసుకొనేవారికి బతికే హక్కు ఉండదంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాకముందే పేదల భూముల్ని మాఫియా ఆక్రమించేది. ప్రజలు పండుగలు చేసుకోనివ్వకుండా అడ్డుపడేది. ఈరోజే ఏ మాఫియా అయినా పేదల భూమిని ఆక్రమించగలదా? మన ఆడ పిల్లలను ఎవరైనా వేధించగలరా? వారు ఏ బిడ్డనైనా వేధిస్తే పక్క రోడ్డు కూడలిలోనే యువరాజ్ వాళ్లకు ట్రీట్మెంట్ ఇస్తాడని బాగా తెలుసు అన్నారు.













