అయోధ్యలో రామాలయ నిర్మాణంపై.. యూపీ సీఎం కీలక ప్రకటన
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోని రామాలయ నిర్మాణంపై కీలక ప్రకటన చేశారు. ఆలయ నిర్మాణ పనులు సగం పూర్తయినట్లు ఆయన తెలిపారు. 2024 మకర సంక్రాంతి రోజు రాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించాలన్నది ఆలయ ట్రస్ట్ యోచన. 2020లో రామాలయ నిర్మాణం మొదలు కాగా, 2024లో పూర్తి కానున్నది. జైపూర్లో పంచఖండ్ పీఠం నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం యోగి మాట్లాడారు. 1949లో రామమందిరం కోసం ఉద్యమం ఆరంభమైన విషయాన్ని గుర్తు చేశారు. ఈ చర్యల ఫలితమే ఆలయ నిర్మాణం సగం పూర్తి కావడమని ఆయన తెలిపారు. ఇటీవలే కాలం చేసిన తన గురువు మార్గదర్శి ఆచార్య ధర్మేంద్రకు యోగి ఈ సందర్భంగా నివాళులు అర్పించారు. రాముడు జన్మించిన చోటే ఆలయాన్ని నిర్మించాలన్నది ఆచార్య కలగా ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.













