శ్రీరామ జన్మభూమిలో మరో అద్భుతం ఆవిష్కృతం

శ్రీరామ జన్మభూమిలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతున్నది. టాటా సన్ ప్రతిపాదించిన దేవాలయాల మ్యూజియం నిర్మాణానికి ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అయోధ్యలో రూ.650 కోట్లతో దేవాలయాల సంగ్రహాలయాన్ని నిర్మిస్తామని టాటా సన్స్ ప్రతిపాదించిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. దేశంలోని ప్రముఖ దేవాలయాల నమూనాలను దీనిలో నిర్మిస్తారని చెప్పారు. దీని కోసం భూమిని 90 సంవత్సరాల పాటు నామమాత్రపు రుసుము రూ.1కి లీజుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు.