ఉత్తర్ ప్రదేశ్ లో అరుదైన సంఘటన .. రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి
ఉత్తరప్రదేశ్‌లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. రామ మందిర నిర్మాణం జరుగుతున్న అయోధ్య లో రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని మంత్రి వర్గం సమావేశమైంది. సాధారణంగా రాజధాని లఖ్‌నవూలో జరిగే ఈ కేబినెట్ భేటీ ఇలా అయోధ్యలో జరగడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. అయోధ్యకు చేరుకున్న సీఎం, మంత్రులు తొలుత హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి రామ్‌లల్లా ఆలయాన్ని దర్శించుకొన్నారు. అనంతరం శ్రీ రామజన్మభూమి మందిర్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి నుంచి రామకథ మ్యూజియంకు చేరుకున్నారు. ఇక్కడి యోగి నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ఈ భేటీలో కీలక ప్రకటనలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.













