థియేటర్స్ కి నో పెర్మిషన్.. అన్ లాక్ 3 విడుదల
అందరూ ఊహించనట్టు సినిమా హాల్స్ కి కేంద్రం అనుమతి ఇవ్వలేదు. 25 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్స్ నిర్వహణ కు. కేంద్రం పచ్చ జెండా ఊపుతుందనే గట్టి అంచనాలు తలకిందులు అయ్యాయి.
బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం…
కంటైన్మెంట్ల జోన్ల బయట కార్యకలాపాలు జరుపుకోవడానికి అనుమతి ఇచ్చింది.. ఆగస్ట్ నెలలో కూడా మెట్రో సేవలు, బార్లు, థియేటర్స్, కు నిషేధం వర్తిస్తుంది. జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, యోగా సెంటర్స్ మాత్రం ఆగస్టు5 నుంచి ప్రారంభించుకోవచ్చు. అయితే వీటి నిర్వహణకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి, ఇకపై అంతర్రాష్ట్ర ప్రయాణాలు కు ఎటువంటి అనుమతి అవసరం లేదు. రాత్రి పూట కర్ఫ్యూ పూర్తిగా ఎత్తివేత. ఆగస్టు నెలాఖరు వరకూ విద్యా సంస్థలు కోచింగ్ సెంటర్లు తెరవకూడదు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చు. అంతర్జాతీయ విమాన ప్రయాణం పై నిషేధం కొనసాగుతుంది. వందే భారత్ విదేశీ విమానాల రాకపోకలు కొనసాగుతాయి.
Click here Unlock 3 Order & Guidelines













