విజయవాడలో నిర్మలా సీతారామన్ పర్యటన ఖరారు
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రేపు బుధవారం (7వ తేదీన) విజయవాడలో పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12:25 నిమిషాలకు చెన్నై నుంచి హైదరాబాద్.. అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి కేంద్ర మంత్రి చేరుకోనున్నారు. గన్నవరం నియోజకర్గంలోని జక్కుల, నెక్కలం, గూడవల్లి సర్కిల్ వద్ద వ్యవసాయ క్షేత్రంలో నేరుగా రైతులను కలిసి మాట్లాడనున్నారు. అనంతరం నేరుగా విడిది గృహానికి చేరుకొని 3.00 గంటలకు కేంద్ర ప్రభుత్వ అధికార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నాలుగు గంటలకు ది వెన్యూ కన్వెన్షన్ హాలులో వ్యవసాయ బిల్లులపై రైతులు, వ్యవసాయరంగ నిపుణులుతో నిర్వహించే చర్చా కార్యక్రమం లో సీతారామన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు, బీజేపే నేతలు హాజరవుతారు.













