మేం వద్దనలేదు.. ఆయనే రాలేదు
హైదరాబాద్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను రావొద్దంటూ ప్రధాని కార్యాలయం సందేశం పంపినట్టుగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని కార్యాలయం స్పందించింది. ఈ అంశంపై కేంద్ర సహాయ మంత్రి డా.జితేంద్ర సింగ్ స్పందించారు. ఆ వార్త పూర్తిగా అవస్తావమని, ప్రధాని కార్యాలయం అలాంటి మెసేజ్ ఏదీ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. నిజానికి ఫిభ్రవరి 5 నాడు ప్రధాని హైదరాబాద్లో పర్యటనలో సీఎం కేసీఆర్ ఉంటారని భావించామని, కానీ అనారోగ్య కారణాలతో ఆయన రాలేకపోతున్నట్టు సీఎం కార్యాలయమే ప్రధాని కార్యాలయానికి సమాచారం ఇచ్చిందని గుర్తు చేశారు.













