అండర్ వరల్డ్ డాన్ చనిపోలేదు…

కరోనాతో అండర్ వరల్డ్ డాన్ మృతి చెందారనే విషయం ప్రముఖంగా మీడియాలో ప్రసారమైన సంగతి తెలిసిందే. చోటా రాజన్ ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారని ఎయిమ్స్ వైద్యులు తెలిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. చోటా రాజన్ చనిపోలేదని వారు వెల్లడించారు. అలాగే ఎయిమ్స్ వర్గాలు కూడా ఆ వార్తను ఖండించాయి. ఢిల్లీలో తీహార్ జైల్లో ఉన్న రా•న్ కు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో, ఆయనను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర నికల్జీ. భారత్‍కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న రాజన్ 2015లో ఇండొనేషియా నుంచి పోలీసు అధికారులు తీసుకొచ్చారు. కట్టదిట్టమైన భద్రత మధ్య అతన్ని తీహార్ జైల్లో ఉంచారు.