తాజ్‌మహల్ వద్ద కలకలం…
ప్రపంచ ప్రఖ్యాత కట్టడం ఆగ్రాలోని తాజ్‌మహల్ వద్ద ఓ అనుమానాస్పద డబ్బా కలకలం రేపింది. తాజ్‌మహల్ సమీపంలోని పురాణీ మండీ ప్రాంతం షాజహాన్ గార్డెన్ వద్ద ఓ చిన్న క్యాన్‌కు తాళం వేసి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే తాజ్‌గంజ్ పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్‌కు తెలియజేశారు. బాంబు నిర్వీర్యం దళం ప్రత్యేక కిట్ ధరించి అత్యంత జాగ్రత్తగా క్యాన్ తెరిచింది. అయితే అందులో పేలుడు పదార్థాలు లేవని, కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయని తేల్చింది. బాంబ్ స్క్వాడ్ క్యాన్‌ను తెరిచే సమయంలో ఆ మార్గం వైపు వెళ్లకుండా పోలీసులు వాహనాలను నిలిపివేశారు.













