స్వదేశానికి తెలుగు రాష్ట్రాల విద్యార్థులు
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో తెలుగు విద్యార్థులు స్వదేశానికి చేరుకుంటున్నారు. మూడు ప్రత్యేక విమానాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన చెరో తొమ్మిది మంది విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న ఏపీ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పీఆర్సీ) ప్రవీణ్ ప్రశాశ్ ఆధ్వర్యాన భవన్ ఉద్యోగులు ఉచిత వసతి, భోజన, రవాణా సదుపాయాలు అందించారు. ఇప్పటి వరకు 1500 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.













