తమిళనాడు సీఎం స్టాలిన్ కు టీటీడీ ఆహ్వానం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మాప్రచారంలో భాగంగా ఈ నెల 16న తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో నిర్వహిస్తున్న శ్రీవారి కల్యాణానికి విచ్చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ను ఆహ్వానించారు. టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు ఏపీ నందకుమార్, తమిళనాడు చెన్నై టీటీడీ స్థానిక సలహా మండలి చైర్మన్ శేఖర్ రెడ్డి కలిసి ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శ్రీనివాస కల్యాణోత్సవం ఆహ్వాన పత్రికను అందజేశారు.













