శ్రీశారదా పీఠాధిపతిని కలిసిన టీటీడీ చైర్మన్
రుషీకేశ్లో చాతుర్మాస దీక్ష ఉన్న విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వాములను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. తిరుమలలో ఇటీవల నిర్వహించిన పవిత్రోత్సవాల పవిత్రాలను, శ్రీవారి లడ్డూ ప్రసాదం, అభిషేక జలాలను అందజేశారు. టీటీడీలో తీసుకున్న పలు నిర్ణయాలను స్వామీజీ దృష్టికి తీసుకెళ్లారు. అన్నవరం దేవస్థానం అధికారులు, అర్చకులు శారదా పీఠాధిపతులను కలిశారు. స్వామీజీని కలిసి వారిలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈవో మూర్తి తదితరులు ఉన్నారు.













