మాజీ సీఎంను రాజ్యసభకు నామినేట్ చేసిన తృణమూల్ కాంగ్రెస్
గోవా మాజీ ముఖ్యమంత్రి లుయిజినో ఫలేయిరోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి లుయిజినో సేవలు దేశానికి అవసరమని, తమ ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నట్లు ఆ పార్టీ తెలిపింది. పశ్చిమ బెంగాల్లో నవంబర్ 29వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. టీఎంసీ ఎంపీ అర్పిత్ ఘోష్ ఇటీవల రాజ్యసభకు రాజీనామా చేశారు. ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఫలేయిరో వచ్చే వారం బెంగాల్లో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. సెప్టెంబర్ 29వ తేదీన ఫలేయిరో టీఎంసీలో చేరారు.













