రాజ్యసభ సభ్యులుగా ముగ్గురి ప్రమాణం
రాజ్యసభలో ముగ్గురు నూతన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన పార్లమెంటు భవనంలో ప్రమాణ చేసిన తొలి సభ్యుడుగా సత్నాం సింగ్ సంధు చరిత్ర సృష్టించారని చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ చెప్పారు. స్వాతి మాలీవాల్ రెండుసార్లు ప్రమాణం స్వీకరించాల్సి వచ్చింది. మొదటిసారి ఆమె కొన్ని పదాలను అదనంగా చేర్చడంతో దానిని పరిగణనలో తీసుకోవడం లేదని చైర్మన్ చెప్పడం దీనికి కారణం. వీరిద్దరితో పాటు నారాయణ్‌దాస్ గుప్తా కూడా ప్రమాణం చేశారు. గుప్తా, మాలీవాల్లు ఆప్ తరపున ఎంపిక కాగా, చండీగఢ్ విశ్వవిద్యాలయ వ్యవస్థాప కులపతి సత్నాం సింగ్ సంధును రాష్ట్రపతి నామినేట్ చేశారు.













