తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపుపై… కేంద్రం స్పష్టత
తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం సృష్టతనిచ్చింది. 2026 జనాభా లెక్కల ఆధారంగా రాజ్యాంగంలోని 170 ఆర్టికల్ ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని స్పష్టం చేసింది. దీన్ని బట్టి ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 2031 తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని తేల్చి చెప్పింది. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153 నియోజకవర్గాలుగా పెంచాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు పెంచుతారు? అంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్సభలో లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బదులిచ్చారు.
ఆంధప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రకారం నియోజక వర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153 నియోజకవర్గాలుగా పెంచాల్సి ఉంది. అలాగే ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కూడా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలను 225కు పెంచుతారు.













