ఆ డీల్‌తో దేశానికి రూ.21,000 కోట్ల నష్టం
ఎన్డీయే రఫేల్ డీల్ ద్వారా దేశ ఖజానాకు తూట్లు పొడిచిందని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రఫేల్ ఒప్పందంలో అవినీతి ద్వారా భారత్ రూ.21,000 కోట్లు నష్టపోయిందని మోదీ సర్కార్‌పై మండిపడ్డారు. ఈ ఒప్పందంలో అవినీతిపై గతంలో రాహుల్ గాంధీ పదేపదే చెప్పిన విషయం ఇప్పుడు నిజమని రుజువైందని అన్నారు. రఫేల్ ఒప్పందంలో భారత దళారీకి మిలియన్ యూరోల ముడుపులు ముట్టాయని ఫ్రెంచ్ మీడియా కథనాల నేపథ్యంలో ఈ విషయం బయటపడింది. మరోవైపు రఫేల్ ఒప్పందంలో అవినీతిపై ఫ్రెంచ్ మీడియా వెల్లడించిన అంశాలను నిరాధార ఆరోపణలుగా బీజేపీ తోసిపుచ్చింది.













