విమానాల్లో బోజన సేవలపై కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో కరోనా ఉద్ధ•తి నేపథ్యంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో భో•నసేవలలను నిలిపివేసింది. ఏప్రిల్ 15 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భోజన సేవలపై పౌర విమానయాన శాఖ నేడు సమీక్ష నిర్వహించింది. రెండు గంటల కంటే తక్కువ సమయం ప్రయాణించే విమానాల్లో ఈ సేవలపై నిషేధం విధించింది. దేశీయంగా విమాన సేవలు అందించే ఎయిర్లైన్లు రెండు గంటలు అంతకంటే ఎక్కువ సమయం ప్రయాణించే విమానాల్లో మాత్రమే భోజన సేవలను అందించాలి అని మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ ముప్పు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.













