మోడీ ఏడాది పాలనపై బీజేపి విస్తృతస్థాయి సమ్మేళనాలు
భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన ఏడాది పూర్తయిన సందర్భంగా నెల రోజుల పాటు వాస్తవిక విజయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు అన్ని జిల్లాల్లో నిరాడంబరంగా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ అధిష్టానం ఆదేశించింది. ఇందుకు సంబంధించి జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. ఆంధప్రదేశ్‌లో వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాలను మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగా నాగభూషణం పర్యవేక్షిస్తారు. మీడియా వ్యవహారాలు, సమావేశాల నిర్వహణ బాధ్యతలను రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్, మాజీమంత్రి రావెల కిషోర్‌బాబు నిర్వహిస్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, వాహన చట్టం, రామజన్మభూమి నిర్మాణ పక్రియ, డోక్లాం వంటి విజయాలు, కరోనా సమయంలో వ్యవహరించినతీరు, లాక్డౌన్ పర్యవేక్షణలో తీసుకున్న నిర్ణయాలు, రూ.20లక్షల కోట్ల ఆత్మ నిర్బర్ అభయాన్ ప్యాకేజీ, వలసకూలీల సహాయం కోసం అమలు చేసిన ప్యాకేజీ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వాటి ఉద్దేశాలను ప్రజలకు వివరించనున్నారు.
పత్రికా సమావేశాలు, వివిధ అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చేందుకు తీసుకోవాల్సిన కార్యక్రమాలు కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, ఎంపీ సుజ నా చౌదరి, పాకా సత్యనారాయణ, ఆదినారాయణ రెడ్డి, వివిధ మోర్చాల కార్యకలా పాలు వై.సత్యకుమార్, సోము వీర్రాజు, సురేష్‌రెడ్డి, శరణాల మాలతీ రాణి చూస్తా రు. సామాజిక మాధ్యమాలు, ఐటీ వ్యవహారాలు ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, పి.రవికిరణ్, కన్నా నాగరాజు, లోకుల గాంధీ, ఆత్మ నిర్బర్ భారత్‌పై ర్యాలీలు, సమావేశాలు ఎస్.విష్ణువర్థన్ రెడ్డి, నీలకంఠ, సీహెచ్ పార్థసారధి చూడనున్నారు.













