ఎలన్ మస్క్‌కు ఆఫర్ ఇచ్చిన… కేంద్ర మంత్రి గడ్కరీ
ఎలన్ మస్క్‌కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆఫర్ ఇచ్చారు. భారత్‌లో టెస్లా కార్లు తయారు చేయవచ్చంటూ ఆహ్వానం పలికారు. ఎలన్ మాస్క్ టెస్లా కార్లను భారత్‌లో తయారు చేయాలనుకుంటే తమకు ఇబ్బందేమీ లేదని ప్రకటించారు. ఎలన్ మస్క్ భారత్‌లో పర్యటించాలని నితిన్ కోరారు. ఎలన్ మస్క్ వచ్చి, ఇక్కడ మ్యానిఫ్యాక్చరింగ్ ప్రారంభించాలని ఆయన కోరారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అని, పోర్టులు కూడా అందుబాటులో వున్నాయని అన్నారు. భారత్ నుంచి ఎగుమతులు చేయవచ్చని, అయితే మేడిన్ చైనా టెస్లాకు మాత్రం ఛాన్స్ లేదని తేల్చి చెప్పారు. అయితే చైనాలో తయారు చేసి, భారత్‌లో విక్రయించాలనుకుంటే మాత్రం మేం ఒప్పకోం. భారత్‌లోనే మ్యానిఫ్యాక్చరింగ్ చేయాలని కోరారు.













