మోదీ రోడ్ షో కోసం చైనా ఫోటో.. ఇదెక్కడి మాయ స్వామి..

ఇటీవల తెలంగాణలోని కొల్లాపూర్‌లో భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన రోడ్ షో కి భారీగా జనం తరలివచ్చారు అని ఒక ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అయింది. ఇసుక వేస్తే కూడా రాలనంతగా నిండిపోయిన ఆ జన సముద్రాన్ని చూసి ఎవరైనా ఆశ్చర్య పోవలసిందే. అంతేకాదు అక్కడికి వచ్చిన ప్రజలు మద్యం కోసమో.. డబ్బు కోసమో రాలేదు..మోదీ పై వారికి ఉన్న అపారమైన ప్రేమ,నమ్మకంతో వచ్చారు… అని ఆ ఫోటోకి క్యాప్షన్ కూడా పెట్టారు. అయితే అనుకోకుండా ఈ ఫోటోపై జరిగిన ‘ఫ్యాక్ట్ చెక్’ కారణంగా ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే ఫోటో ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న గుజరాత్ ప్రజలు అంటూ వాడడం జరిగింది. అయితే ఇది అప్పుడు కూడా తీసిన ఫోటో కాదు. నిజం చెప్పాలంటే ఇది అసలు మన దేశానికి సంబంధించిన ఫోటో కాదు. 12 మే 2008 నాడు ఈ ఫోటో ‘ఫ్లికర్’. (Flickr)అనే వెబ్‌సైట్‌లో ప్రచురించడం జరిగింది. అప్పట్లో చైనాలో నిర్వహించిన ఒలంపిక్ క్రీడల సమయంలో..ఒలింపిక్ టార్చ ను తీసుకెళ్తున్నప్పటి సందర్భంలో తీసిన ఫోటో. అసలు విషయం తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోతున్నారు.