జీ20 సదస్సులో తెలుగు రాష్ట్రాల స్టాళ్లు
ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో ఈ నెల 8 నుంచి 10 వరకు జరిగే జీ`20 సదస్సులో తెలుగు రాష్ట్రాల స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. దేశీయ చేతివృత్తులు, కళాకారుల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పి, అంతర్జాతీయ మార్కెట్ కల్పించే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మచిలీపట్నం, శ్రీకాళహస్తి కళాకారులు సహజ రంగులతో, వెదురు బ్రష్ తో భిన్న రూపాలను చిత్రించే కలంకారీ దుస్తుల స్టాల్ పెట్టనున్నారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాకలో దుస్తులపై సహజ రంగులతో ఇక్కత్ ఆకృతులతో రూపొందించే తెలియ రుమాల్ ఉత్పత్తులతో స్టాల్ పెట్టబోతున్నారు.













