తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం
కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సంస్థ దక్షిణాది రాష్ట్రాలకు మీడియా సలహాదారుగా చంద్రశేఖర్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే ఢిల్లీలో ఆయనకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఆయన గతంలో రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) సీఈవోగా పని చేశారు. ప్రస్తుతం దక్షిణ భారత, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) వ్యాపార అభివృద్ధి, ప్రభుత్వ వ్యవహారాల సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన విద్యుత్ సంస్థలకు బీఈఈ తరపున సలహాలు, సూచనలను అందించనున్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన లైఫ్ మిషన్‌కు నోడల్ అధికారిగానూ పనిచేయనున్నారు. చంద్రశేఖర రెడ్డి 2015 నుంచి ఏపీఎస్ఈసీఎం సీఈఓగా పనిచేసిన హయాంలో రాష్ట్రానికి 5 సార్లు జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులు దక్కాయి.













