టాటా చంద్రశేఖరన్ కు ప్రతిస్టాత్మక అవార్డు
టాటా గ్రూపు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, లాక్హిడ్ మార్టిన్ సీఈవో జిమ్ టైక్లెట్ ఈ ఏడాదికి గాను ప్రతిష్టాత్మక యూఎస్ఐబీసీ గ్లోబల్ లీడర్ షీప్ అవార్డు అందుకోనున్నారు. అద్భుతమైన నాయకత్వం, భారత్ అమెరికా సంబంధాల పురోగతికి కృషి చేసిన వారికి గుర్తింపుగా ఏటా యూఎస్ఐబీసీ గ్లోబల్ లీడర్షిప్ అవార్డులను అందించడం కొనసాగుతోంది అని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే యూఎస్-ఇండియా బిజినెన్ కౌన్సిల్ (యుఎస్ఐబీసీ) ప్రకటించింది. ఎన్.చంద్రశేఖరన్, జిమ్ టైక్లెట్ ఇద్దరూ యూఎస్ ఇండియా సీఈవో ఫోరమ్‌కు సహ అధ్యక్షులుగా ఉండడం గమనార్హం. గతంలో సన్‌ఫార్మా దిలీప్ సంఘ్వి, గూగుల్ సుందర్ పిచాయ్, అమెజాన్ జెఫ్ బెజోస్ తదితరులు కూడా ఈ అవార్డులను అందుకున్న వారిలో ఉన్నారు.













