జల్లికట్టుకి తమిళనాడు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సంక్రాంతి సీజన్లో తమిళనాడులో జల్లికట్టు పోటీలు నిర్వహిస్తారు. ఈ సంంక్రాంతి సీజన్‌ను పురస్కరించుకుని రాష్ట్రంలో రేపటి నుంచి జల్లికట్టు పోటీలు జరుపనున్నారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి జనవరి 1 నుంచి ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. అయితే దీనికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉండడంతో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంది. జల్టికట్టు కోసం ప్రజల నుంచి డిమాండ్లు అధికమవుతుండడంతో, నూతన మార్గదర్శకాలతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈసారి జల్లికట్టు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ అనుమతిని తప్పనిసరి చేసింది. తమిళనాడు పురాతన సంప్రదాయ క్రీడ జల్లికట్టు. బలమైన ఎద్దులను బరిలోకి వదిలి లొంగదీసుకోవడం ఈ క్రీడలో చూడొచ్చు. అందుకే జల్లికట్టు తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన సప్రందాయ క్రీడా గుర్తింపు పొందింది.













