స్విట్జర్లాండ్ ఎంబసీ కీలక ప్రకటన … భారతీయులకు
భారత్లోని స్విట్జర్లాండ్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది అక్టోబరు వరకు భారతీయులకు షెంజెన్ వీసా దరఖాస్తులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పెండిరగ్ అప్లికేషన్లు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంబసీ తెలిపింది. దీనిపై స్వట్జర్లాండ్ టూరిజం ఈస్ట్ మార్కెట్స్ హెడ్ సిమోన్ బాస్హార్ట్ స్పందిస్తూ ప్రస్తుతం స్విస్ ఎంబసీల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోంది అని తెలిపారు. భారతీయులకు మాత్రమే గాక, చైనా పర్యాటకులకు కూడా స్విస్ ఈ షెంజెన్ వీసా దరఖాస్తులను తాత్కాలికంగా నిలిపివేసింది.













