సొంత పార్టీపై స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు

సొంతపార్టీ పై ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. కొందరు ఆప్ నేతలు తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఆప్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆప్ సీనియర్ నేత ఒకరు నిన్న నాకు కాల్ చేశారు. స్వాతిపై అభ్యంతరకర ఆరోపణలు చేయాలంటూ పార్టీలోని ప్రతి ఒక్కరిపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలిపారు. నా వ్యక్తిగత ఫొటోలను లీక్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నట్లు సదరు నేత తెలిపారు. నాకు మద్దతుగా మాట్లాడిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని బెదిరిస్తున్నారట. నాకు వ్యతిరేకంగా మీడియా సమావేశాలు నిర్వహించేందుకు కొందరిని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేసే బాధ్యతను ఇంకొందరికి అప్పగించారు. రిపోర్టర్లను కొట్టి నాపై నకిలీ స్టింగ్ ఆపరేషన్లు చేయించాలని చూస్తున్నారు అని స్వాతి ఆరోపించారు.