ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా సుశీల్ చంద్ర!
భారత తదుపరి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా (సీఈసీ) సుశీల్ చంద్ర నియమితులు కానున్నారు. ప్రస్తుతం సీఈసీగా ఉన్న సునీల్ అరోరా నేడు పదవీ విరమణ చేయనున్నారు. అత్యంత సీనియర్ ఎన్నికల అధికారిని సీఈసీగా నియమించడం ఆనవాయితీ. ఆయన నియామకంపై ఏ క్షణమైనా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. అనంతరం కొత్త సీఈసీగా 13న సుశీల్ చంద్ర బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం. పార్లమెంటు ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 14న ఎన్నికల సంఘం కమిషనర్గా నియమితులైన సుశీల్ చంద్ర పదవీకాలం 2022 మే 14 వరకూ ఉంది. ఆయన ఆధ్వరంలో గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.













