రాముల వారికి భూరి విరాళం.. సమకూర్చింది ఇతడే!
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రామమందిరం కల సాకారమైంది. బాలరాముడు ఎట్టకేలకు అయోధ్యలో కొలువుదీరాడు. దేశ, విదేశాలకు చెందిన ఎందరో రామభక్తులు తమవంతు విరాళాలు సమకూర్చారు. ఇందులో రోజువారీ కూలీలతో పాటు పెద్ద పెద్ద వ్యాపారులు సైతం ఉన్నారు. ఇలా రాముల వారికి భూరి విరాళం అందించిన వారిలో దిలీప్ కుమార్ వి లాఖి, ఆయన కుటుంబం ముందువరసులో ఉంటుంది. సూరత్‌కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి రాములోరికి 101 కేజీల బంగారాన్ని కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ బంగారాన్ని రామాలయం తలుపులు, గర్భగుడి, త్రిశూలం, డమరు, పిల్లర్లకు కేటాయించారు. ప్రస్తుత మార్కెట్లో బంగారు 10 గ్రాములు రూ.68 వేలుగా ఉంది. ఆ లెక్కన రామాలయానికి లాఖి కుటుంబం రూ.86 కోట్లు విరాళం ఇచ్చినట్లయ్యింది. రామ మందిర ట్రస్టుకు వచ్చిన విరాళాల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక మొత్తం అని తెలుస్తోంది.













