సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. .. మళ్లీ వర్చువల్
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 3 నుంచి వర్చువల్ పద్థతిలో కేసుల విచారణ జరుగుతుందని తెలియజేసింది. రెండు వారాల పాటు ఈ విధానం లోనే కేసుల విచారణ జరుగుతుందని పేర్కొంది. కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీం కోర్టు తెలిపింది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తుండగా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఇతర ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యక విచారణను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. గతంలో కొవిడ్ కేసులు వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ విధంగానే వర్చువల్ గానే విచారణలు జరిగాయి.













