అమెరికా కోర్టు తీర్పును నిలిపేసిన సుప్రీంకోర్టు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అనుబంధ వాణిజ్య సంస్థ యాంత్రిక్స్ కార్పొరేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2005లో కుదిరిన అంతరిక్ష ఒప్పందాన్ని 2011లో రద్దు చేసుకున్నందుకు బెంగళూరుకు చెందిన అంకుర పరిశ్రమ దేవాస్ మల్టీ మీడియాకు 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8900 కోట్ల) నష్ట పరిహారాన్ని యాంత్రిక్స్ సంస్థ చెల్లించాలని అమెరికాలో న్యాయస్థానం ఇటీవల ఇచ్చిన తీర్పున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం నిలుపుదల చేసింది. ఉభయ పక్షాల మధ్య బెంగళూరులో పెండింగులో ఉన్న కేసులను ఢిల్లీ హైకోర్టుకు బదలాయించాలని యాంత్రిక్స్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వినతికి ధర్మాసనం ఆమోదం తెలిపింది.













