కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
దేశ రాజధాని ఢిల్లీ లో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వివాదం సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అధికారాల నియంత్రణ విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంబద్ధతను సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఈ పిటిషన్పై తమ వైఖరిని తెలపాలని కోరుతూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు ఈ పిటిషన్ను సవరించి, లెఫ్టినెంట్ గవర్నర్ ను ప్రతివాదిగా చేర్చాలని ఢల్లీి ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 17కు వాయిదా వేసింది.













