వారిని 15 రోజుల్లోనే తరలించాలి
లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కూలీలను తరలించే పక్రియను మరో 15 రోజుల్లో పూర్తిచేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు సూచించింది. వలస కూలీలు సొంత రాష్ట్రాలకు చేరుకున్న అనంతరం వారి పూర్తి వివరాలు గ్రామాల వారీగా నమోదు చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. వీటికి సంబంధించిన ఆదేశాలను జారీ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. వలస కూలీల అంశాన్ని సుమోటోగా తీసుకొని విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు తాజాగా ఈ విధంగా స్పందించింది. విచారణ సందర్భంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సుప్రీంకోర్టుకు విన్నవించారు.













