సెప్టెంబర్ 15 వరకు ఆ పదవిలో ఆయనే : సుప్రీంకోర్టు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్‌గా సెప్టెంబర్ 15వ తేదీ వరకు సంజయ్ కుమార్ మిశ్రా కొనసాగనున్నారు. సుప్రీంకోర్టు ఆయన్ను కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఎటువంటి పొడిగింపు ఉండదని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ బీఆర్ గవాయి, విక్రమ్‌నాథ్, సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. ఎస్కే మిశ్రా పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సంజయ్ మిశ్రా పదవీ కాలం జులై 31తో ముగియనుండటంతో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.













