ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ అరెస్టు విషయంలో జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. సీబీఐ అరెస్టు వ్యవహారాన్ని సవాల్ చేయాలనుకుంటే హైకోర్టుకు వెళ్లవచ్చని సిసోడియాకు సూచించింది. సీబీఐ ఛార్జీసీటులో సిసోడియా పేరు లేకున్నా ఆయన్ను అరెస్టు చేయడం అక్రమమని సిసోడియా తరపున న్యాయవాది అభిషేక్ సింఫ్వీు సుప్రీకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా దర్యాప్తునకు సహకరించడం లేదని సీబీఐ చేస్తోన్న ఆరోపణలు కూడా బలహీనమైన సాకుగా పేర్కొన్నారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జిస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సీబీఐ అరెస్టును సవాల్ చేయాలనుకుంటే హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.













